indian high commissioner for pakistan: భారత రాయబారికి సమన్లు జారీ చేసిన పాకిస్థాన్

  • హైకమిషనర్ జేసీ సింగ్ కు పాక్ సమన్లు
  • భారత్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతోందంటూ ఆరోపణ
  • ముగ్గురు పౌరులు చనిపోయారు, ఐదుగురు గాయపడ్డారంటూ నింద

సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్... మరోవైపు భారతే కాల్పులకు తెగబడుతోందంటూ నాటకాలాడుతోంది. ఏకపక్షంగా భారత్ కాల్పులకు తెగబడుతోందంటూ పాకిస్థాన్ లోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 2న భారత బలగాలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద కాల్పులకు తెగబడ్డారని ఆరోపించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.

ఈ కాల్పులకు భారత్ సమాధానం చెప్పాలంటూ భారత హైకమిషనర్ జేపీ సింగ్ కు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైసల్ సమన్లు జారీ చేశారు. దీనిపై జేపీ సింగ్ స్పందిస్తూ, భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని అన్నారు. 

More Telugu News