హార్దిక్ పాండ్య బాదిన భారీ సిక్సర్ కు గాయపడ్డ ప్రేక్షకుడు!

  • భారీ సిక్సర్ బాదిన హార్డిక్ పాండ్య
  • అది తగిలి అభిమానికి చిట్లిన పెదవి, నాలుక
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య బాదిన బాదుడికి ఒక అభిమాని గాయపడ్డాడు. తాజాగా టీమిండియా‌-ఆసీస్‌ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన వన్డేలో హార్దిక్ పాండ్య భారీ సిక్సర్ ను బాదాడు. అయితే, ఆ బంతి నేరుగా వెళ్లి గ్యాలరీలో మ్యాచ్‌ వీక్షిస్తున్న తొషిక్ అగర్వాల్ అనే అభిమాని ముఖాన్ని ముద్దాడింది. దీంతో ఆ అభిమాని గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన మైదాన సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు. అతనికి పెదవి, నాలుక గాయమైందని వైద్యులు తెలిపారు. గాయం స్వల్పమైందని అన్నారు. 
Go Back to Shorts
hardik pandya
4th one day
sixer

More Telugu News