ధనుష్ సరసన సాయి పల్లవి... `మారి-2` లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఫిదా పిల్ల
- హీరోయిన్ పాత్ర కొత్తగా ఉంటుందన్న నిర్మాతలు
- తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మాణం
- సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై అభిమానుల ఆసక్తి
ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న పీఎల్ విజయన్ `కణం` సినిమా తర్వాత సాయి పల్లవి నటించనున్న రెండో తమిళ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీయనున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా మొదటి భాగానికి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం అనిరుధ్, ధనుష్‌కి మనస్పర్థలు వచ్చిన కారణంగా రెండో భాగానికి ఎవరు సంగీత దర్శకత్వం వహించనున్నారనే అంశం ఆసక్తిగా మారింది.