డికాప్రియోతో తన అనుబంధాన్ని వివరించిన 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్
- టైటానిక్ మూవీ మా ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చింది
- డికాప్రియోతో స్నేహం దేవుడిచ్చిన వరం
- డికాప్రియో నాకు కుటుంబ సభ్యుడు లాంటి వాడు
- టైటానిక్ క్లైమాక్స్ లో జరిగిందే నిజజీవితంలో కూడా జరిగింది
ఇప్పటికీ తమ ఇద్దర్నీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం 'టైటానిక్' మూవీయేనని తెలిపింది. ఆ షూటింగ్ సందర్భంగా ఏర్పడిన అనుబంధం నేటికీ కొనసాగుతోందని చెప్పింది. తామిద్దరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నామని అంది. ఇంకా వివరంగా చెప్పాలంటే డికాప్రియో తన కుటుంబంలోని వ్యక్తిలాంటి వాడని చెప్పింది.
అతనితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. తమ ఇద్దరిపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయని తెలిపిన ఆమె, 'టైటానిక్' క్లైమాక్స్ లో జరిగినదే నిజ జీవితంలో కూడా జరిగిందని నవ్వుతూ చెప్పింది. కాగా, 'టైటానిక్' సినిమాలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జాక్ మరణించగా, అతనికి దూరమైన రోజ్ వేరే వ్యక్తిని వివాహం చేసుకుని జీవితం గడుపుతుంది.