`పద్మావతి`లో షాహిద్ కపూర్ లుక్ ఇదే!
- రతన్ సింగ్ పాత్రలో రాజసం కురిపిస్తున్న షాహిద్
- పాత్ర కోసం చాలా కష్టపడ్డానన్న హీరో
తన లుక్ గురించి షాహిద్ మాట్లాడుతూ - `రాజ్‌పుత్ వంశానికి చెందిన మహారాజులు శారీరకంగా చాలా దృఢంగా కనిపిస్తారు. రతన్ సింగ్‌లా కనిపించడానికి నేను కండలు పెంచాను. శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా డైట్ పాటించాను` అన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే `పద్మావతి` పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇంకా ఇందులో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన రణ్‌వీర్ సింగ్ లుక్‌ను విడుదల చేయాల్సి ఉంది. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది.