కొత్త స్పిన్నర్ ఇడుగో... ఇక కాచుకోండి: బీసీసీఐ
- ప్రాక్టీస్ సెషన్ లో సరదాగా స్పిన్ బౌలింగ్ వేసిన ధోనీ
- ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్న బీసీసీఐ
- ఆఫ్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ వేస్తూ కనిపించిన ధోనీ
దానికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ అభిమానులతో పంచుకుంటూ, "భారత స్పిన్ బౌలింగ్ అటాకింగ్ ఎవరు చేరారో చూడండి" అంటూ వ్యాఖ్యానించింది. ఈ వీడియోలో ఆఫ్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ లను ధోనీ సులువుగా సంధిస్తుండటం కనిపిస్తోంది. కాగా, గతంలోనూ అప్పుడప్పుడు గ్లౌజెస్ పక్కన బెట్టిన ధోనీ, సరదాగా బౌలింగ్ కు దిగిన సంగతి తెలిసిందే.
ఈ తాజా వీడియోను చూసిన పలువురు, ధోనీ మూడో వన్డేలో బౌలింగ్ చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. తమ అభిమాన ఆటగాడు బ్యాటింగ్, కీపింగ్ తో పాటు, కెప్టెన్సీని, స్పిన్, ఫేస్ బౌలింగ్ ను కూడా వేయగలడని కామెంట్లు పెడుతున్నారు.