వాళ్లనే అడగచ్చుగా...!: రణబీర్, మహీరా ఖాన్ ల ఫొటోలపై రిషికపూర్ స్పందన!
- రణబీర్ బ్యాచిలర్
- తనకు నచ్చిన అమ్మాయిని కలవొచ్చు
- ఫొటోల వెనుక ఏముందో నాకు తెలియదు
- వారినే అడిగితే మంచిది
"రణ్ బీర్ యంగ్ స్టార్. బ్యాచిలర్. అతనికి ఏ అమ్మాయిని కలవాలని అనిపిస్తే, వారిని కలవొచ్చు" అని రిషికపూర్ చెప్పారు. ఈ ఫొటోల వెనుక ఏముందో మనం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. వారిద్దరూ బహిరంగప్రదేశంలో ఉన్నారని... రెస్టారెంట్ లో కాని లేదా స్మోక్ చేయలేని ప్రాంతంలో కాని ఉండి ఉంటారని... అందుకే బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నారని చెప్పారు. పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగకూడదనే కఠిన నిబంధన అమెరికాలో ఉందని చెప్పారు. ఇంతకంటే తాను ఎక్కువ చెప్పలేనని... ఎందుకంటే తనకు ఏమీ తెలియదని అన్నారు.