కపిల్ దేవ్ పాత్రలో అర్జున్ కపూర్?
ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హృతిక్ రోషన్‌లను నిర్మాతలు సంప్రదించినట్లు, చివరికి అర్జున్ కపూర్ ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 27న ఓ వేడుక నిర్వహించి తెలియజేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేడుకకు ఆనాటి వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్లతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం.