రేప్ కేసులో బాలీవుడ్ నిర్మాతకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఆదేశం

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అతడిని లొంగి పోవాల్సిందిగా ఆరు నెలల క్రితమే కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

బాధితురాలి లాయర్ కథనం ప్రకారం.. అండర్ వరల్డ్ వ్యక్తుల ద్వారా ఆమెను చంపిస్తానని మొరానీ బెదిరించాడు. దిల్‌వాలే వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన మొరానీ 2జీ కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఈ కేసులో కొన్ని నెలలు జైలులోనూ ఉన్నారు. కరీం మొరానీని తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
Go Back to Shorts
Producer
Karim Morani
Anticipatory Bail
Rape Case

More Telugu News