నా ఫేవరెట్ హీరోయిన్ తో దిగిన సెల్ఫీ ఇది: యువరాజ్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఫేవరెట్ హీరోయిన్ తో దిగిన సెల్ఫీ ఇది: యువరాజ్ సింగ్

  • కాజోల్ తో సెల్ఫీ దిగి ఆనందించిన యూవీ
  • ఎయిర్ పోర్టులో కలిసిన కాజోల్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్, తన అభిమాన నటిని కలుసుకున్న ఆనందపు వేళ, ఆమెతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ యువరాజ్ సింగ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారు?... బ్లాక్ బ్యూటీ కాజోల్. వీరిద్దరూ ఓ ఎయిర్ పోర్టులో తారసపడిన వేళ, పలకరించుకుని ఈ సెల్ఫీ దిగారు. కాజోల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా, యువరాజ్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ఫోటోను షేర్ చేసుకోగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. కాగా, ఇటీవలి శ్రీలంక పర్యటనకు, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ కు యువరాజ్ కు స్థానం దక్కని సంగతి తెలిసిందే. దీంతో రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలు ఆడి రాణించి, సెలక్టర్ల దృష్టిలో పడాలని యువరాజ్ భావిస్తున్నాడు.
yuvaraj singh
kajol

More Telugu News