షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. విమాన సర్వీసులకు సిద్ధమైన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్
ప్రస్తుతం సాయి దర్శనానికి విమానంలో వెళ్లాలంటే ముంబై, ఔరంగాబాద్ వెళ్లి అక్కడి నుంచి మళ్లీ రైలును కానీ, బస్సును కానీ ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఆ కష్టాలు ఇక తప్పినట్టే. షిర్డీకి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాక్డీ గ్రామంలో రూ.350 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. మొత్తం 400 హెక్టార్లలో నిర్మించిన ఈ విమానాశ్రయ బాధ్యతలను మహారాష్ట్ర విమానాశ్రయ సంస్థ చూసుకుంటోంది.