జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమణ
దీంతో ఈ ఓపెనింగ్ రౌండ్ మ్యాచ్‌లో వీరిద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. చివరికి విజయం కరోలినాను వరించడంతో సైనా వెనుదిరగాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో సైనా మంచి ప్రదర్శన కనబరిచింది. మొదటి గేమ్‌లో 11-9 పాయింట్లతో సైనా ముందంజలో ఉంది. కానీ ఒక్కసారిగా కరోలినా విజృంభించడంతో సైనా ఓటమి పాలయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే.