ఆర్‌కే స్టూడియో దగ్ధం గురించి వచ్చిన కార్టూన్‌పై మండిపడ్డ రిషి కపూర్!
రాజ్ కపూర్ సొంత స్టూడియో ఆర్కే ఫిలిమ్స్ ఆయన దర్శకత్వంలో నిర్మించిన మొదటి సినిమా `ఆగ్ (అగ్ని)`. ఇలా ఓ ప్రమాదాన్ని చూసి రాజ్‌కపూర్ నవ్వుతున్నట్లుగా చూపించడాన్ని రిషి కపూర్ ఖండించారు. ప్రమాదం జరిగిన రోజు కూడా ఆయన ట్వీట్లు చేశారు. `ఆర్‌కే స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగింది. చారిత్రాత్మక స్టేజీ 1 నాశనమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు` అని ట్వీట్ చేశారు. అలాగే `కావాలనుకుంటే మళ్లీ స్టూడియోను నిర్మించుకోవచ్చు. కానీ దానితో ఉన్న జ్ఞాపకాలను తిరిగి తీసుకురాలేం` అని రిషికపూర్ మరో ట్వీట్ చేశారు.