కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు దగ్ధం, ముగ్గురు సజీవదహనం
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మట్టి దిబ్బలను కారు ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిని ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, పిల్లలు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (2)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.