పవన్ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ హైలైట్ అట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ హైలైట్ అట!

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా .. షూటింగ్ దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఇక్కడ పవన్ .. కీర్తి సురేశ్ ల పై ఒక పాటను .. కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళుతుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేశారు.

 త్రివిక్రమ్ -పవన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాకి మేనత్త .. మేనల్లుడి సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తెరకెక్కుతోన్న సినిమాలో, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలుస్తుందట. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే వుంటాయని అంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  
pavan
keerthi

More Telugu News