పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది!

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాపై అందరిలోను ఎంతో ఆసక్తి వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయాలను అందుకోవడమే అందుకు కారణం. ప్రస్తుతం రూపొందుతోన్న సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. పవన్ ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాడు కనుక 'ఇంజనీర్ బాబు'ను ఖరారు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 నిన్న ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్, రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. సంక్రాంతి బరిలోకి పవన్ దిగనుండటం ఖాయమని తేల్చేశారు. అయితే ఈ వరుసలో 'రంగస్థలం 1985' .. 'భరత్ అను నేను' .. బాలకృష్ణ 102వ మూవీ ఉన్నాయి. ఈ సారి సంక్రాంతికి పోటీ ఒక రేంజ్ లో వుండనుందన్న మాట.    
pavan
keerthi

More Telugu News