: ఉత్తర కొరియా సరిహద్దుల వద్ద బాంబులు వేసిన దక్షిణ కొరియా.. మరింత పెరిగిన ఉద్రిక్తతలు!

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో కొరియా ద్వీపకల్పం అట్టుడుకుతోంది. జపాన్ భూభాగం మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించడంతో ఆందోళనలు మరింత పెరిగిన నేపథ్యంలో, దక్షిణ కొరియా మరో దూకుడు చర్యకు పాల్పడింది. ఉత్తర కొరియా సరిహద్దుకు కొంచెం దూరంలో ఏకంగా 8 బాంబులను యుద్ధ విమానాల ద్వారా జారవిడిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న నేపథ్యంలో, దక్షిణ కొరియా ఈ చర్యకు పాల్పడింది. మరోవైపు పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా పసిఫిక్ ప్రాంతానికి ఉత్తర కొరియా క్షిపణి చేరుకోవాలంటే... అది జపాన్ మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లనే జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది.


More Telugu News