pavan kalyan: పవన్ మనసు మార్చేసుకున్నాడా?
ఇటీవల పవన్ కల్యాణ్ ఓ వేదికపై మాట్లాడుతూ .. ఇకపై పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పారు. అవసరమైతే సినిమాలను వదిలేస్తానని అన్నారు. దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాయే చివరిది కావొచ్చనే ప్రచారం మొదలైంది. అయితే సినిమాలు వదులుకోవడం కరెక్ట్ కాదని పవన్ కి సన్నిహితులు చెప్పారట.
పార్టీ కోసం ఫండ్స్ వసూలు చేసే ఆలోచన లేనప్పుడు .. సినిమాలు చేయకపోతే ఎలా? అనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది. ఆయనకి ఇంతటి క్రేజ్ ను తెచ్చిన సినిమాలను చేస్తూ ఉండటమే పార్టీకి మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దాంతో పవన్ తన మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరోవైపున రాజకీయాలను చక్కబెట్టాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు.