: వందేమాతరం ఆలపిస్తున్నా కూర్చునే ఉన్న ఎంఐఎం కార్పొరేటర్లు.. బీజేపీ-శివసేన సభ్యుల నిరసన.. సభలో విధ్వంసం.. చివరికి సస్పెన్షన్!

వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడని ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. వందేమాతరం ఆలపిస్తున్నా కూర్చునే ఉన్న కార్పొరేటర్లను చూసిన అధికార శివసేన- బీజేపీ కార్పొరేటర్లు వెల్‌లోకి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు. దీంతో అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫ్యాన్లు విరిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో ఏఎంసీ మేయర్ భగవాన్‌దాస్ ఘదమొడె ఇద్దరు కార్పొరేటర్లను ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు.

More Telugu News