నాని .. శర్వానంద్ దారిలో నితిన్?

ఇటీవల విడుదలైన మూడు సినిమాలలో నితిన్ చేసిన 'లై' వసూళ్ల పరంగా వెనుకబడినట్టుగా చెప్పుకుంటున్నారు.ఈ సినిమా కోసం దాదాపు 35 కోట్ల వరకూ ఖర్చు చేశారు. సినిమాలో ముప్పావు భాగానికి పైగా విదేశాల్లోనే చిత్రీకరణ జరపడం వలన ఈ స్థాయిలో ఖర్చు అయింది. అయితే ఆ స్థాయిలో వసూళ్లు రావడం కష్టమైపోయింది.

 నితిన్ మార్కెట్ కి మించి ఖర్చు చేయడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాని .. శర్వానంద్ లు తమ సినిమా బడ్జెట్ 10 నుంచి 15 కోట్ల లోపే ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ మార్జిన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లనే వాళ్ల సినిమాలు హిట్ అయితే భారీ స్థాయిలో లాభాలు ఉంటాయి ..  పరాజయం పాలైతే నష్టాలు పెద్దగా వుండవు. అందువలన నితిన్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే బాగుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.   
Go Back to Shorts
nithin

More Telugu News