rajanikanth: 42 ఏళ్ల పండగ చేసుకుంటున్న రజనీ ఫ్యాన్స్!
అగ్రకథానాయకుడిగా ఎదిగిన తరువాత ఆ స్థానాన్ని కాపాడుకోవడం ఎంతటివారికైనా కష్టమే. కొత్తతరం వచ్చిన తరువాతైనా అప్పటివరకూ బలంగా వున్న ఆ స్థానం బలహీనపడటం మొదలుపెడుతుంటుంది. రజనీకాంత్ ఇందుకు పూర్తి మినహాయింపు అనే చెప్పాలి. తరాలు మారుతున్నా .. ప్రేక్షకుల అభిరుచి మారుతున్నా ఆయనకి ఆదరణ అంతకంతకి పెరుగుతుండటం విశేషం. అలా తనని తాను మలచుకుంటూ ఉండటం ఆయన ప్రత్యేకత.
అలాంటి రజనీకాంత్ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఈ రోజుతో 42 వసంతాలు పూర్తి చేసుకున్నారు.1975 ఆగస్టు 18న 'అపూర్వ రాగంగళ్' విడుదలతో ఆయన నట ప్రయాణం మొదలైంది. ఎన్నో విభిన్నమైన పాత్రలు ఆయనకి విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ రోజున అభిమానుల గుండెల్లో ఆయనను సూపర్ స్టార్ గా నిలబెట్టాయి. నటుడిగా ఆయన 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అభిమానులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వివిధ సినిమాల్లోని ఆయన గెటప్స్ కి సంబంధించిన ఫోటోలను .. డైలాగ్స్ ను షేర్ చేసుకుంటున్నారు.