త్రివిక్రమ్ గారూ, ఇక మీదే భారం!: నితిన్
దాంతో నితిన్ నేరుగా వెళ్లి త్రివిక్రమ్ ను కలిసినట్టు సమాచారం. నితిన్ తదుపరి సినిమాకి త్రివిక్రమ్ కథను అందించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి కథను అందించి వదిలేయకుండా, కాస్త దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండమని త్రివిక్రమ్ ను నితిన్ రిక్వెస్ట్ చేశాడట. తనకి తప్పకుండా హిట్ పడేలా చూడమని కోరాడట. ఈ సినిమాకి పవన్ కల్యాణ్ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే.