'రాజు వచ్చినాడు' టైటిల్ కూడా రూమరే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజు వచ్చినాడు' టైటిల్ కూడా రూమరే!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేసిన 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' కొత్త రికార్డులకు తెరతీయడంతో, వాళ్ల కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి. దాంతో పవన్ అభిమానులందరి దృష్టి ఈ సినిమాపైనే వుంది. ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు అన్నట్టుగా 'దేవుడే దిగి వచ్చినా' .. 'గోకుల కృష్ణుడు' .. 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్స్ వినిపించాయి.

 తాజాగా 'రాజు వచ్చినాడు' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే ఇదంతా ప్రచారం మాత్రమేననీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ఈ సినిమా టీమ్ స్పష్టం చేసింది. అసలు ఇంతవరకూ ఏ టైటిల్ అనుకోలేదట. పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఫస్టులుక్ వదిలే ఛాన్స్ వుంది కనుక, ఆ రోజున టైటిల్ ఏమిటనేది తెలిసిపోవచ్చు. అప్పటివరకూ ఈ సస్పెన్స్ ను భరించాల్సిందే.   
pavan
keerthi

More Telugu News