మణిరత్నం నెక్స్ట్ మూవీ వీరితోనే!

కొంతమంది దర్శకులు తమదైన శైలిలో వరుసగా సినిమాలు చేస్తూ వెళుతుంటారు. పరాజయాల ప్రభావం వాళ్లపై అంతగా కనిపించదు. ఒక సినిమా ప్లాప్ అయినా ఆ తరువాత వచ్చే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం జరుగుతుంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో మణిరత్నం ముందు వరుసలో కనిపిస్తారు.

 'చెలియా' పరాజయం పాలైన తరువాత ఆయన తన తదుపరి సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కథ ప్రకారం ఇప్పటికే మాధవన్ .. దుల్కర్ సల్మాన్ .. అదితీరావు హైదరి .. పహద్ ఫాజిల్ లను ఆయన ఎంపిక చేసుకున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం ఆయన విజయ్ సేతుపతిని కూడా తీసుకున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతిని సంప్రదించగానే ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా తరువాత మణిరత్నం నెక్స్ట్ ప్రాజెక్ట్ చరణ్ తో ఉంటుందేమో చూడాలి మరి.    
Go Back to Shorts
manirathnam

More Telugu News