'లై' గురించి నితిన్ నిజం ఒప్పేసుకున్నాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లై' గురించి నితిన్ నిజం ఒప్పేసుకున్నాడు!

నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'లై' మూవీ, ఈ నెల 11వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి తొలి రోజున మిక్స్డ్ టాక్ వచ్చింది. అది నిజమేననే విషయాన్ని నితిన్ ఒప్పేసుకున్నాడు. విడుదలైన రోజున ఈ సినిమా బాగుందని 50 శాతం మంది మాత్రమే అన్నారని చెప్పాడు. అయితే తాను డీలా పడిపోలేదనీ .. కంటెంట్ పై గట్టి నమ్మకంతోనే వున్నానని అన్నాడు.

 రెండవ రోజున సినిమా బాగుందనే వారి శాతం 65కి పెరిగిందని చెప్పాడు. ఇక మూడవ రోజుకి వచ్చేసరికి 85 శాతానికి పైగా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారని అన్నాడు. ఇలా ఈ సినిమాకి ఆదరణ పెరుగుతూ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. మున్ముందు ఈ సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  
nithin

More Telugu News