క్లారిటీ వచ్చేసింది .. 'లై' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు!
దాంతో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర స్పందిస్తూ, తమ సినిమా విడుదల వాయిదా పడటం లేదని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 5వ తేదీన, హైదరాబాద్ - జెఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది.