nayanatara: 5 కోట్లు అడుగుతోన్న నయనతార!

షార్ట్స్‌లో చూడండి
అదృష్టానికి మరో పేరుగా నయనతారను గురించి చెప్పుకోవచ్చని ఆమె అభిమానులు అంటున్నారు. అంతలా ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో దూసుకుపోతోంది. ఒక వైపున సీనియర్ హీరోలతోను .. మరో వైపున యువ కథానాయకులతోను కలిసి నటించడం ఆమెకే చెల్లింది. ఇక కథానాయిక ప్రాధాన్యత గల పాత్రలంటే నయనతార పేరే ముందుగా వినిపిస్తుంది.

 అలాంటి నయనతార తన పారితోషికాన్ని మరింత పెంచేసినట్టు కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. తెలుగులో బాలకృష్ణ 102వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, చిరంజీవి సినిమా చేయడానికి 5 కోట్లు అడిగిందట. ఒక వాణిజ్య ప్రకటన చేయడానికే ఆమె 5 కోట్లవరకూ తీసుకుందని వినికిడి. అలాంటిది 'ఉయ్యాలవాడ' వంటి బహుభాషా చిత్రానికి ఆమె ఆ మాత్రం అడగడంలో ఆశ్చర్యం లేదని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
nayanatara

More Telugu News