పవన్ .. త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్ 32 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ .. త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్ 32 కోట్లు!

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఛానల్స్ పోటీ పడ్డాయి. చివరిగా తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ను 21 కోట్లకి .. హిందీ శాటిలైట్ రైట్స్ ను 11 కోట్లకి జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ శాటిలైట్ రైట్స్ 32 కోట్లు పలకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

 ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనేది మార్కెట్ వర్గాల మాట. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జల్సా' .. ' అత్తారింటికి దారేది' సినిమాలు అనూహ్యమైన విజయాలు సాధించాయి. అందువలన వాళ్ల కాంబినేషన్లో వస్తోన్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు వున్నాయి. ఈ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి శాటిలైట్ రైట్స్ లభించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
trivikram
pavan

More Telugu News