charan: 'రంగస్థలం' కోసం 5 కోట్లతో పల్లెటూరి సెట్!

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సమీపంలో .. గోదావరి నేపథ్యంలో చిత్రీకరించారు. ఇక అక్కడి గ్రామంలో చిత్రీకరించడానికి వీలు కాని సన్నివేశాలను సెట్లో తెరకెక్కించనున్నారు.

అందుకోసం హైదరాబాద్ లో .. 1985 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే పల్లెటూరి సెట్ వేయిస్తున్నారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు 35 రోజుల పాటు ఈ సెట్లోనే చిత్రీకరణ జరపనున్నట్టు చెబుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు - అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.       
Go Back to Shorts
charan
samanta

More Telugu News