: ఫెద‌ర‌ర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

త‌న స్నేహితుడు రోజర్ ఫెద‌ర‌ర్‌ను ప్రోత్స‌హించ‌డానికి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఇంగ్లండ్ వెళ్లాడు. ఎనిమిదో వింబుల్డ‌న్ టైటిల్ గెల్చుకోవ‌డానికి కొద్ది దూరంలో ఉన్న రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌కు స‌చిన్ పెద్ద అభిమాని. వింబుల్డ‌న్ ఫైన‌ల్‌కు చేరుకున్న ఫెద‌ర‌ర్‌ను ద‌గ్గ‌రుండి గెలిపించాల‌నుకుంటున్న‌ట్లు స‌చిన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వింబుల్డ‌న్ వారు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

`నాలాంటి టెన్నిస్ అభిమానుల‌కు వింబుల్డ‌న్ కంటే ఉల్లాసాన్నిచ్చే టోర్న‌మెంట్ ఇంకోటి లేదు. ప‌దేళ్ల నుంచి వింబుల్డ‌న్‌లో రోజ‌ర్ ఫెదరర్ ప్ర‌ద‌ర్శ‌న చూస్తున్నాను. అందుకే అత‌న్ని స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చాను` అని స‌చిన్ అన్నారు. ప్ర‌పంచం మొత్తం ఒక టెన్నిస్ ఆట‌గాడిగా ఫెదరర్‌ను ఆరాధిస్తుండ‌గా, తాను మాత్రం అతని వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల అభిమానిగా మారిన‌ట్లు స‌చిన్ చెప్పారు. అలాగే రోజర్ అన్ని విష‌యాల్లోనూ చాలా మంచి వ్య‌క్త‌ని, గొప్ప‌వాడ‌ని స‌చిన్ పొగిడారు.

More Telugu News