'లై' దర్శకుడికి అర్జున్ క్లాస్ పీకాడట!
సీన్ పేపర్ తీసుకుని డైలాగ్స్ ప్రిపేర్ అయిన తరువాత, దర్శకుడు హను మళ్లీ డైలాగ్స్ మారుస్తున్నాడట. ఇలా ఒకటికి రెండు సార్లు జరగడంతో అర్జున్ కి కోపం వచ్చేసిందట. ఆయనకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు విషయంలో ఎంతో అనుభవమున్న సంగతి తెలిసిందే. అందుకే ఇది కరెక్ట్ కాదంటూ ఆయన హను రాఘవపూడిపై అసహనాన్ని ప్రదర్శించాడట. సెట్ నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నించడంతో, అతి కష్టం మీద ఆయనని శాంతింపజేసినట్టు చెప్పుకుంటున్నారు.