పదమూడేళ్ల తరువాత పోటీకి దిగిన హీరోలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పదమూడేళ్ల తరువాత పోటీకి దిగిన హీరోలు!

తెలుగులోనూ యాక్షన్ కింగ్ అర్జున్ కి చెప్పుకోదగిన సినిమాలు .. విజయాలు వున్నాయి. అలాంటి అర్జున్ ప్రస్తుతం నితిన్ తో కలిసి 'లై' సినిమా చేస్తున్నాడు. గతంలో నితిన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో అర్జున్ హనుమంతుడుగా నటించాడు. 2004లో 'శ్రీ ఆంజనేయం' వస్తే .. 13 సంవత్సరాలకి మళ్లీ ఈ కాంబినేషన్ 'లై' ద్వారా సెట్ అయింది.

 ' శ్రీ ఆంజనేయం'లో నితిన్ పల్లెటూరి కుర్రాడిగా .. అమాయకంగా కనిపిస్తాడు. ఇప్పుడు 'లై' సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. అప్పటికీ .. ఇప్పటికీ నటనలోను బాగా రాటు దేలాడు. ఆయనలోని ఈ మార్పును అర్జున్ గమనించి అభినందించాడట. ఇద్దరూ కూడా పోటీపడి నటించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెరైటీ పోస్టర్స్ తో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  
nithin
arjun

More Telugu News