stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
వరుసగా ఆరు రోజుల పాటు లాభాలు ఆర్జించిన స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 28813 పాయింట్ల వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 8898 పాయింట్ల వద్ద ముగిశాయి. మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగినా రిలయన్స్, కోల్ ఇండియా, లుపిన్, అరబిందో ఫార్మా, విప్రో, హెచ్ యూఎల్ తదితర షేర్లు లాభపడ్డాయి. ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ తదితర షేర్లు నష్టపోయాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.71 వద్ద కొనసాగుతోంది.
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News