ఆ చిన్నారికి స్వయంగా దేశాధ్యక్షుడే కాల్ చేసి.. ఏడవకూడదని చెప్పారు!
ఆ చిన్నారి ఏడుస్తుండగా ఆమె తల్లి వీడియో తీసి అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోని దాదాపు మూడు లక్షల మంది చూసి షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన వారిలో ఆ దేశ ప్రెసిడెంట్ జోకో కూతురు కహియంగ్ అయు కూడా ఉన్నారు. దీంతో చిన్నారి నిషా వివరాలు తనకు తెలపాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను కోరారు. చివరికి నిషా ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. ఇక తన తండ్రి అయిన ప్రెసిడెంట్ జోకోను నిషాతో ఫోన్‌లో మాట్లాడించేలా చేశారు. దీంతో నిషా కుటుంబం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. నిషాతో ప్రెసిడెంట్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన సంభాషణను ఆయన కుమారుడు న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ‘ఏడవకూడదు.. బాగా చదువుకో’ అంటూ నిషాతో మాట్లాడిన సంభాషణ ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా నిషా కూడా ప్రెసిడెంట్ కుటుంబానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు.