ఫోన్ కొంటామని చెప్పారు.. లాక్కొని పారిపోయారు.. ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్!
మనోజ్ , మోతిస్వరణ్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్‌లైన్ లో ఫోన్ కోసం సెర్చ్ చేసి రంజిత్ కుమార్ ఆన్‌లైన్‌లో ఉంచిన ఫోన్‌ను చూశారు. దాన్నికొంటామని చెప్పి ఫోన్ చేశారు. రంజిత్‌ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్ వద్దకు రమ్మని చెప్పారు. రంజిత్ అక్కడికి రాగానే, అతడి దగ్గరకు వెళ్లిన సదరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆఫోన్ వివరాలు అడుగుతున్నట్లుగా మాట్లాడి ఒక్కసారిగా ఫోన్ లాక్కొని బైక్ పై పారిపోయారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులని అదుపులోకి తీసుకున్నారు.