డిసెంబర్ 17న మాత్రమే ఆడే ఈ సినిమాను చూడండి: సెహ్వాగ్ పిలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 17న మాత్రమే ఆడే ఈ సినిమాను చూడండి: సెహ్వాగ్ పిలుపు

డిసెంబర్ 17న ఢిల్లీలోని త్యాగరాయ స్టేడియంలో ప్రదర్శించనున్న ఛెకా కో విజునే ఫేకా సినిమాను చూడాలని వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులకు పిలుపునిచ్చాడు. క్రికెట్ మైదానాన్ని వీడిన అనంతరం వీరేంద్ర సెహ్వాగ సోషల్ మీడియాలో ట్వీట్లతో సరికొత్త స్టార్ డమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచర ఆటగాళ్లలో స్పూర్తి పెంచేలా ట్వీట్ చేస్తూ, ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నాడు.

ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే తరువాతి రోజు డిసెంబర్ 17న భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మాజీ ప్రపంచ ఛాంపియన్, సుదీర్ఘ అనుభవమున్న ఫ్రాన్సిస్ ఛెకాతో తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో విజేందర్ కు ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే భయం కలిగే పంచ్ లు రుచి చూపిస్తానంటూ ఛెకా మాటల యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో విజేందర్ పై కలబడి ఛెకా రెచ్చగొట్టాడు. అయితే తాను బౌట్ లోనే పంచ్ లతో మాట్లాడతానని విజేందర్ సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఛెకాను విజేందర్ త్యాగరాయ స్టేడియంలో విసిరేస్తాడని అంటూ వీరిద్దరి మ్యాచ్ ను సినిమాతో పోల్చాడు  సెహ్వాగ్.
sehwag tweets

More Telugu News