అప్పట్లో పిల్లి బిర్యానీ అమ్మారు.. ఇప్పుడు కుక్క బిర్యానీ!
ఇటీవల పీఎఫ్‌సీఐ నిర్వాహకులు చెన్నయ్‌లో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని వండి పెడుతున్నారని, రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నారని కనుగొన్నారు. అవి కూడా సోషల్‌మీడియాలో వచ్చిన ఫొటోల సాయంతోనే కనుగొన్నారు. ఇటీవలే బెంగళూరులోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. పీఎఫ్‌సీఐ రంగంలోకి దిగి నిజాన్ని తేల్చడంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఇప్పుడు చెన్నయ్‌లోనూ కుక్క మాంసం అమ్ముతున్నట్లు తేలితే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.