అలా అమ్మవారు కనకవర్షం కురిపించిందట!

అలా అమ్మవారు కనకవర్షం కురిపించిందట!

అలా అమ్మవారు కనకవర్షం కురిపించిందట!
కర్ణాటక రాష్ట్రం హోస్పేట సమీపంలో.. తుంగభద్ర నదీ తీరంలో హంపీ నగరం కనిపిస్తుంది. అనేక ఆలయాల సమాహారంగా హంపీ దర్శనమిస్తుంది. అలనాటి శిల్పకళా నైపుణ్యానికి ఇక్కడి నిర్మాణాలు అద్దం పడుతుంటాయి. ఈ ప్రాంతం రామాయణ ఘట్టాలను కనులముందు సాక్షాత్కరింపజేస్తుంది. శ్రీరాముడు నడయాడిన ఈ పుణ్య ప్రదేశాన్ని స్పర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

 ఇక్కడే పవిత్రమైన 'పంపా సరోవరం' కనిపిస్తుంది. రామ భక్తురాలైన శబరి ఇక్కడే నివసించిందనీ .. శ్రీరాముడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ సరోవరం తీరంలోనే విద్యారణ్య స్వామివారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారట. తపస్సు పూర్తయిన తరువాత ఆయన 'కనకధారాస్తవం' పఠించడంతో, అమ్మవారు అనుగ్రహించి కనకవర్షం కురిపించిందట. ఆ సంపదతోనే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించాడని అంటారు. ఈ కారణంగానే ఆయన ఈ ప్రదేశంలో విజయలక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.        

More Bhakti Articles