మహాశివరాత్రి
సృష్టి - స్థితి - లయ కారకులైన త్రిమూర్తులలో శివుడుకి బోళాశంకరుడు అనే పేరుంది. తనని తలచుకోవడమే ఆలస్యం ... తరలివచ్చి అవలీలగా అనుగ్రహించడం ఆయన నైజం. తన భక్తులు కష్టాల్లో వున్నప్పుడు కైలాసాన్ని విడిచి కదిలిరావడానికి ఆయన ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అభిషేకం ... అడవి పూలు తప్ప మరేమీ అడగని ముక్కంటి 'ముక్తి'ని ప్రసాదించడంలో ముందుంటాడు. సాధారణమైన రోజుల్లోనే ఆయన అంతలా కరిగిపోయి కనికరిస్తే ... ఇక మహాశివరాత్రి నాడు ఆయన చూపే అనుగ్రహం గురించి వేరే చెప్పాలా!
ప్రతి ఏడాది మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చే ఈ మహా శివరాత్రి వెనుక ఒక పురాణగాధ వుంది. ఒకసారి బ్రహ్మ దేవుడు ...విష్ణుమూర్తి ఇద్దరూ కూడా తమలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. వారిలో అహంకారం తలెత్తడం గమనించిన ఈశ్వరుడు ఇద్దరి మధ్య లింగ రూపాన్ని ధరించి తన ఆద్యంతాలను తెలుసుకోవలసిందిగా వారిని కోరాడు.
వాళ్లిద్దరూ ఎంతగా ప్రయత్నించినా ఆ లింగం యొక్క పాద భాగాన్ని గానీ ... పై భాగాన్ని గాని చూడలేకపోయారు. దాంతో పరమశివుడి ఆధిక్యతను గుర్తించి ఆయనను విశేషమైన రీతిలో సేవించారు. పంచ భూతాలను తనలో లీనం చేసుకుని జ్యోతిర్లింగ రూపంగా శివుడు అవతరించిన ఈరోజే మహాశివరాత్రిగా చెప్పబడుతోంది. సర్వాధారుడైన సదాశివుడు నిరాకారుడనీ ... సృష్టి స్థితి లయలకు మూలకారకుడని ఈ లింగోద్భవం చాటిచెబుతుంది.
ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ ఉమా శంకరుడిని ఆరాధించి జాగరణ చేస్తే, అనంతమైన పుణ్య ఫలాలను అందుకోవచ్చునని 'శివపురాణం' చెబుతోంది. ఇక ఉపవాసం అంటే చాలామంది అది ఒక ఆహార నియమం అనుకుని ఆ రోజున ఫలాలు మాత్రమే తినడమో ... పాలతో సరిపెట్టుకోవడమో చేస్తుంటారు. కానీ నిజానికి 'ఉపవాసం' అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్ధం. 'ఉప'అనగా 'దగ్గరగా'అనీ ... 'వాసం' అనగా 'నివసించుట'అని అర్ధం. ఈ రోజున శివయ్యకు దగ్గరగా ఉంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఆరాధించాలి.
ఇక 'జాగరణ'అంటే కూడా ఏదో ఒక రకంగా తెల్లవార్లు మెలకువతో వుంటే సరిపోతుందని అనుకునేవారు లేకపోలేదు. కానీ జాగరణ అంటే మనసనే దివ్య నేత్రంతో ఆ పరమాత్ముని దర్శించడానికి ప్రయత్నించడమే. ఈ రోజున శివారాధనను తెలిసి చేసినా ... తెలియక చేసినా ముక్తిని ప్రసాదిస్తుందని చెప్పడానికి 'తిన్నడు'( భక్త కన్నప్ప) చరిత్ర ఉండనే వుంది.
మహా శివరాత్రి రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలైన సోమనాథ్ ... శ్రీశైలం ... మహాకాళం ... ఓంకారం ... కేదారినాథ్ ... భీమశంకర్ ... త్రయంబకం ... కాశీ ... వైద్యనాథం ... నాగేశ్వరం ... ఘ్నష్టేశ్వరం ... రామేశ్వరం వంటి క్షేత్రాలను, పంచారామాలైన అమరారామం ... ద్రాక్షారామం ... కుమారారామం ... క్షీరారామం ... సోమారామం వంటి క్షేత్రాలను దర్శిస్తే పాపాలన్నీ పటాపంచాలైపోయి, పుణ్య ఫలాలు లభిస్తాయని శివపురాణం చెబుతోంది.