పవిత్ర ధామాలు

పవిత్ర ధామాలు
అణువణువునా ఆధ్యాత్మికతను ఆవిష్కరిస్తూ ... ఆహ్లాదకరమైన వాతావరణంలో పవిత్రతకు ప్రతీకగా నిలుస్తూ నలు దిక్కుల్లో 'నాలుగు ధామాలు' విరాజిల్లుతున్నాయి. గుజరాత్ లో 'ద్వారకా ధామం' ... తమిళనాడులో 'రామేశ్వర ధామం'... 'ఉత్తరప్రదేశ్ లో 'బదరీనాథ్ ధామం'... ఒరిస్సాలో'జగన్నాథ్ ధామం' ఇలా అఖండ భారతాన నాలుగు దిక్కుల్లోను నాలుగు ధామాలు అలరారుతూ ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతున్నాయి.

అరేబియా మహా సముద్రం ... బంగాళాఖాతం కలిసేచోట'రామేశ్వర ధామం' వెలసింది. ఇక్కడి రామలింగేశ్వరుడిని దర్శిస్తే సమస్త పాపాలు హరించబడతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 'బదరీనాథ్ ధామం'లో శ్రీ మహావిష్ణువు పద్మాసీనుడై భక్తులకు కనువిందు చేస్తుంటాడు. 'ద్వారక ధామం' అరేబియా సముద్ర తీర ప్రాంతంలో దర్శనమిస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు పరిపాలించిన పవిత్రమైన ఈ ప్రదేశాన్ని భక్తులు విశేషమైన సంఖ్యలో దర్శిస్తుంటారు.

ఇక 'జగన్నాథ్ ధామం' బంగాళాఖాతం తీర ప్రాంతంలో వెలసింది. ఈ ధామంలో బలరామ - సుభద్ర సహితంగా శ్రీ కృష్ణుడు దర్శనమిస్తాడు. ఇక్కడి చక్ర తీర్థం భక్తుల పాపాలను కడిగేసి పుణ్య ఫలాలను అందిస్తుంది.

More Bhakti Articles