లక్ష్మీ వారాల నోము
'లక్ష్మీవారాల నోము'గా చెప్పుకునే ఈ గురువారాల నోము అమ్మవారి కటాక్షంతో పాటు బృహస్పతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని చెబుతుంటారు. ఈ నోముకి సంబంధించిన కథలోకి వెళితే ... ఓ గ్రామంలో ధనికురాలైన ఓ ఇల్లాలు వుండేది. ఓ రోజున ఉత్తముడైన ఓ సాధువు ఆమె ఇంటికి బిక్షకి వెళ్ళగా చేయి ఖాళీ లేదని చెప్పి పంపించి వేసింది. ఆ తరువాత కూడా ఆయన ఏ రోజున ఆమె ఇంటికి వెళ్లినా ఏదో ఒక కారణం చెప్పి ఖాళీ చేతులతోనే పంపించేది.
దాంతో ఆ ఇల్లాలికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ సాధువు, తనకి బిక్ష వేయవద్దంటూనే ఫలానా విధంగా నడచుకుంటే మంచిదని ఆమెకి చెప్పి వెళ్లిపోయాడు. ఆ విధంగా నడుచుకోవడం వలన ఆ ఇల్లాలి జీవితం అస్తవ్యస్తమైపోయింది. సంపదలన్నీ హరించుకుపోవడమే కాకుండా, భర్త ... పిల్లలు ... తాను ... తలా ఓ దారి అయ్యారు. అప్పుడు ఆ సాధువు వచ్చి ఆమెకి కావలసినంత తీరిక దొరికిన విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన మహానుభావుడని గ్రహించిన ఆ ఇల్లాలు, తన తప్పును క్షమించి ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కించమని ప్రాధేయపడింది.
గురువారం రోజున ఏవైతే చేయకూడదో ... అవే చేయమని తాను ఆమెకి చెప్పాననీ, ఆ విధంగా చేయడం వల్లనే అలాంటి పరిస్థితి వచ్చిందని ఆ సాధువు అన్నాడు. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడే దానాలు చేయాలనీ, ఏవీ లేనప్పుడు చేసే అవకాశం ఉండదని ఆమె గ్రహించడం కోసమే తాను అలా చేశానని చెప్పాడు. పూర్వ వైభవం కలగాలంటే, గతంలో తాను చెప్పిన దానికి వ్యతిరేకంగా వ్యవహరించమని సలహా ఇచ్చాడు.
దాంతో ఆ ఇల్లాలు ప్రతి లక్ష్మీవారం ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసింది. ఇంటినీ ... పూజా మందిరాన్ని శుభ్రపరిచి షోడశోపచారాలతో లక్ష్మీ దేవిని పూజించింది. 16 గురువారాల పాటు ఈ విధంగా అమ్మవారిని పూజించాక, 17వ గురువారం రోజున అమ్మవారికి వడపప్పు - పానకం నైవేద్యంగా సమర్పించింది. ఆ ప్రసాదాన్ని దక్షిణ తాంబూలాలతో పాటు 16 మంది ముత్తయిదువులకు వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకుంది. ఫలితంగా పరిస్థితులన్నీ చక్కబడి ఆమె సంసారం ఒక దారిలో పడింది. ఆ రోజు నుంచి ఆమె దానధర్మాలు చేస్తూ, భర్త ... పిల్లలతో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించింది.