అరుంధతి వ్రతం
స్త్రీలు తెలిసీ తెలియక చేసిన పాపాలు హరించడానికి ... వారికి గల వివాహ పరమైన దోషాలు తొలగిపోవడానికి ... వారి సంతానం - సౌభాగ్యం కళకళలాడుతూ ఉండటానికి ఎన్నో వ్రతాలు చెప్పబడ్డాయి. అలాగే స్త్రీలకు వైధవ్యం రాకుండా వుండటం కోసం చేయవలసిన వ్రతంగా 'అరుంధతి వ్రతం'చెప్పబడింది.
వశిష్ఠ మహర్షి అర్ధాంగి అయిన అరుంధతి ... మహా పతివ్రత. తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను స్థంభింపజేయగల శక్తి సామర్ధ్యాలు ఆమె సొంతం. అలాంటి అరుంధతి వ్రతాన్ని చైత్ర శుద్ధ విదియనాడు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఆ రోజున తల స్నానం చేసి ఇంటిని పరిశుభ్ర పరచుకోవాలి. ఆ తరువాత పూజా మంటపాన్ని ... పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అరుంధతి - ధృవ - వశిష్ట మూర్తులుగా పసుపు ముద్దలను చేసుకుని మంటపంలో ఉంచాలి. ఈ ముగ్గురిని ఆవాహన చేసి శాస్త్రోక్తంగా పూజ చేయాలి.
ఆ తరువాత బెల్లంతో కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఏడుగురు ముత్తయిదువులకు ఒక్కొక్కరికి ఎనిమిది గాజులు ... ఏడు తమలపాకులు ... అయిదు అరటి పళ్లు ... రెండు వక్కలు ... ఒక రవికల గుడ్డను వాయనంగా సమర్పించి వారి ఆశీస్సులు పొందాలి. ఆ తరువాత ఈ వ్రతానికి కారణమైన కథ చదివించుకుని విని అక్షింతలు తలపై ధరించాలి.
ఇక ఈ వ్రతానికి సంబంధించిన కథలోకి వెళితే ... పూర్వం కాశీ నగరానికి చెందిన ఓ విప్రుడు తన కూతురైన సుబలను గుణనిధికి ఇచ్చి వివాహం చేశాడు. దేశాంతరం వెళ్ళిన గుణనిధి, అగ్నిసాక్షిగా చేసిన బాస మరిచి మరో స్త్రీ వ్యామోహానికి లోనై ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్యకు చేసిన ద్రోహానికి గాను అతను అకాల మృత్యువు బారిన పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న సుబల కన్నీళ్లు పెట్టుకుంది. మరో జన్మలో తనకి వైధవ్యం కలగకుండా వుండటం కోసం పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించింది. అంతట ఆది దంపతులు ఆ విషయంలో సుబలకి మాట ఇచ్చి, వైధవ్యం కలగకుండా వుండటం కోసం 'అరుంధతి వ్రతం' చేసుకోవలసిందిగా సూచించినట్టుగా ఈ కథలో కనిపిస్తుంది.