ఉత్సవ మూర్తులు

ఉత్సవ మూర్తులు
సాధారణంగా ఇంట్లో పూజించడం కోసం పెద్ద విగ్రహాలు తీసుకు రావడానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే అత్యంత శక్తిమంతమైన ఆ విగ్రహాలకు నిత్య ధూప దీపాలు ... నైవేద్యాలు వుండాలి. అందువలన కేవలం దేవాలయాలో మాత్రమే ఆ విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు.

ఇక మూలమూర్తుల విషయం అటుంచితే దేవాలయాలోని ఉత్సవ మూర్తులను పంచలోహాలతో తయారు చేస్తుంటారు. రవి గ్రహమునకు 'రాగి' ... గురు గ్రహమునకు 'వెండి' ... కుజ గ్రహమునకు 'బంగారం' ... బుధ గ్రహమునకు 'ఇత్తడి' ... శని గ్రహమునకు 'ఇనుము' చెప్పబడినది. ఈ లోహములు గ్రహాలకు సంబంధించిన గుణాలను కలిగి ఉండటమే కాకుండా అనేక ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా చేయగల శక్తిని కలిగి ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

ఈ విగ్రహాలకు అభిషేకించిన జలాన్ని తీర్థంగా తీసుకుంటే లోపలి క్రిములు నశించి పోతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని కాపాడటంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. అందువలన పవిత్రమైన అభిషేక జలాన్ని అంకిత భావంతోనే కాకుండా, ఆరోగ్య ప్రదమైనవిగా కూడా భావించి వాటిని స్వీకరించాలి.

More Bhakti Articles