దక్షిణావర్త శంఖం
సముద్రంలో లభించే శంఖాల్లో 'దక్షిణావర్త శంఖం' ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. సాధారణంగా శంఖాలు ఎడమవైపున (అపసవ్యంగా) తెరుచుకుని వుంటాయి. కొన్ని మాత్రమే కుడివైపున (సవ్యంగా) తెరుచుకుని వుంటాయి. అరుదుగా లభించే ఈ శంఖాలనే దక్షిణావర్త శంఖాలని అంటూ వుంటారు. శ్రీ కృష్ణుడు ... అర్జునుడు .... భీముడు ... దుర్యోధనుడు మొదలైనవారు ఈ శంఖాలనే ఉపయోగించేవారట. లక్ష్మీదేవితో పాటు సముద్రంలో పుట్టిన కారణంగా దక్షిణావర్త శంఖాన్ని ఆమెకి తమ్ముడిగా చెబుతుంటారు.
దక్షిణావర్త శంఖం పూజగదిలో వుండటం ఎంతో మంచిదనీ, సమస్త సంపదలను అందించే శక్తి ఈ శంఖానికి వుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్య చంద్రుల వంటి దివ్యత్వాన్ని కలిగిన ఈ శంఖం పైభాగంలో గంగాదేవి ... మధ్యలో వరుణదేవుడు .... చివరి భాగంలో బ్రహ్మ నివసిస్తూ ఉంటారని అంటారు. సమస్త తీర్థాలు ఈ శంఖంలో ఉంటాయనీ ... సమస్త దోషాలు దీనిని పూజించినంతనే తొలగిపోతాయని చెబుతుంటారు. అరుదుగా దొరికే ఈ శంఖం అత్యంత ఖరీదు ఉన్నప్పటికీ, దాని ప్రభావం అపారమైనదని చెప్పక తప్పదు.