ఆవుపాలు
భూలోక వాసులకు దైవం ప్రసాదించిన అమృతం ... పాలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవళిస్తుంటాడు. ఇక భక్త సులభుడైన సదాశివుడు పాలతో అభిషేకం చేయించుకోవడానికి ఆరాటపడుతుంటాడు. పాలను ఇచ్చే గోవు సకలదైవ స్వరూపమై నిలిచింది. భూలోకంలో సమస్త మానవాళికి పాలు నిత్యావసరం కనుక పాలిచ్చే జంతువులను కూడా ఎంతో ప్రేమగా ... జాగ్రత్తగా చూస్తుంటారు.
ఇక దేవలోకంలో అమృతంతో సరిపెట్టుకునే దేవతలంతా భూలోకాన పాలను ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు ... అభిషేకాలు చేయించుకుంటుంటారు. దైవానికి అత్యంత ఇష్టమైన 'పంచామృత అభిషేకం'లో మొదటి మూడు కూడా పాలకి సంబంధించినవే కావడం విశేషం. ఈ కారణంగానే పాలు మరింత పవిత్ర మయ్యాయి ... లక్ష్మీదేవి నివాస స్థానమయ్యాయి. దైవ కార్యాలలోను ... శుభకార్యాలలోను పాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తాయి కనుక పాలను పారపోయకూడదనీ, కాళ్లతో తొక్కకూడదని శాస్త్రం చెబుతోంది.
దైవానికి అభిషేకించిన పాలను తీర్థంగా స్వీకరించాలి ... మిగిలితే మొక్కలకు పోయాలి. అంతే గానీ దారిలో గానీ ... మురుగు నీటిలో కలిసే విధంగా గాని పోయకూడదు. పాల వాసన వస్తోన్న ఇంట్లోకి తొంగి చూడటానికి కూడా దరిద్ర దేవత భయపడుతుందట. పూజలు .. అభిషేకాలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం వలన అపచారానికి అవకాశం లేకుండా జాగ్రత్తపడవచ్చు.