శివలింగార్చన

శివలింగార్చన
వైష్ణవ ఆలయాల్లో మూలవిరాట్టుకు అక్కడి పూజారులు మాత్రమే పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక శివాలయాలలో మాత్రం పూజారులు మాత్రమే కాకుండా భక్తులు కూడా అభిషేకాదులు చేస్తుండటం మనం చూస్తుంటాం. అన్ని చోట్లా కాకపోయినా కొన్ని చోట్ల మాత్రం కులమత వర్గ భేదాలు లేకుండా భక్తులతో శివయ్యకి పూజాభిషేకాలు జరుగుతుంటాయి.

అయితే ఇటు దేవాలయాల్లో గానీ, అటు ఇళ్లలో గాని స్త్రీలు శివలింగార్చన చేయవచ్చా? ... లేదా? అనే సందేహం మాత్రం చాలామందిలో తలెత్తుతుంటుంది. శివలింగార్చన స్త్రీలు చేయవచ్చనే సమాధానం మనకి 'శివపురాణం'లో కనిపిస్తుంది. 'ఘష్మ' అనే భక్తురాలు ... అక్కమహాదేవి తదితరులు లింగార్చన చేసి తరించినవారే. అయితే ఈ విషయంలో కొన్ని నియమాలు మాత్రం లేకపోలేదు. బాణలింగాలు ... సాలగ్రామ లింగాలు... పాదరస లింగాలు మినహా, వెండి ... బంగారు శివలింగాలను స్త్రీలు పూజించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Bhakti Articles