ఇష్ట కామేశ్వరీ వ్రతం
సుధీర్గమైన వ్యాధులు ... బాధలు ఎవరి జీవితాన్నైనా అతలాకుతలం చేస్తుంటాయి. వీటి బారినపడిన స్త్రీలు, భర్తను .. పిల్లలను సరిగా చూసుకోలేక నానాఅవస్థలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లని ఆ గండం నుంచి గట్టెక్కించడానికి ఉద్దేశించబడిన వ్రతమే 'ఇష్ట కామేశ్వరీ వ్రతం'.
ఈ వ్రతానికి సంబంధించిన కథలోకి వెళితే ... సుద్యుమ్నుడు అనే ఓ వేదపండితుడు ఇంట 'రంజక'అనే పేరుతో పార్వతీదేవి జన్మించింది. ఆ బాలికను ఆయన అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేశాడు. ఆమె యుక్త వయసుకి రావడంతో తగిన వరుడిని వెతకనారంభించాడు. తనకి తగిన భర్త శంకరుడేనని రంజక తండ్రితో చెప్పింది. ఆమె అలా అంటూ ఉండగానే నంది వాహనంపై శివుడు అక్కడికి వచ్చాడు. ఈశ్వర సాక్షాత్కారం లభించినందుకు సుద్యుమ్నుడు సంతోషంతో పొంగిపోయాడు. కానీ కూతురు దూరమై పోతుందనే బెంగతో వెంటనే నీరసపడిపోయాడు.
తాను పరమేశ్వరుడితో కలిసి కైలాసానికి వెళుతున్నాననీ, బాధపడవద్దని రంజక తండ్రిని ఓదార్చింది. 'కామేశ్వరీ'అనే పేరున తనని పూజించినట్టయితే కోరిన వరాలను ప్రసాదించగలనంటూ ఇష్టకామేశ్వరీ వ్రతాన్ని గురించి చెప్పి నంది వాహనమెక్కి కైలాసానికి వెళ్లిపోయింది. కాలక్రమంలో ఈ వ్రతాన్ని అహల్య - గౌతమి దంపతులు ఆచరించారు.
ఉదయాన్నే తల స్నానం చేసి ... ఇంట్లో పూజా మంటపాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠంపై 'కామేశ్వరీ దేవి' విగ్రహాన్ని వుంచి కలశ సహితంగా పూజించాలి. అరటి ... కొబ్బరి ... చెరుకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 9 లేక 11 మంది బ్రాహ్మణ స్త్రీలను పిలిచి వారి కాళ్లకు ఎర్ర గంధాన్ని పూసి పూజించాలి. వారికి దక్షిణ తాంబూలాలతో పాటు 'చలిమిడి' దానమివ్వాలి. అలాగే ఓ బ్రాహ్మణుడికి ప్రత్యేకమైన వాయనం ఇవ్వాల్సి వుంటుంది.
స్త్రీలు అందుకున్న వాయనంలో నుంచి కొంత అడిగి తీసుకుని దానిని మాత్రమే దంపతులు ఆహారంగా స్వీకరించి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ఇక ఈ వ్రతాన్ని ఆచరించడానికి పరిస్థితులు అనుకూలించనప్పుడు, కథ చదువుకుని అక్షింతలు తలపై ధరిస్తే సరిపోతుందని శాస్త్రం చెబుతోంది.