వరాలను కురిపించే వేణుగోపాలుడు
తూర్పుగోదావరి జిల్లాలో గల కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, పిఠాపురం రాజావార్ల పేర్లు వినిపిస్తూ వుంటాయి. అందుకు కారణం వాళ్లు కొన్ని ఆలయాల నిర్మాణంలోను ... మరికొన్ని ఆలయాల అభివృద్ధిలోను పాలుపంచుకోవడమే. ఆధ్యాత్మిక మార్గంలో వాళ్లు చేసిన ప్రయాణానికి గుర్తుగా నేటికీ అనేక ప్రాంతాలలో వాళ్లు నిర్మించిన ఆలయాలు కనిపిస్తూ వుంటాయి. అలాంటి వాటి జాబితాలో 'లొల్ల' లోని 'రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి' ఆలయం ఒకటి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పరిధిలో ఈ ఆలయం అలరారుతోంది. తన మనోభీష్టం నెరవేరిన కారణంగా, పిఠాపురం రాజావారు కొన్ని వేణుగోపాలస్వామి ఆలయాలు నిర్మించాడనీ, అందులో ఈ ఆలయం ఒకటిగా విలసిల్లుతోందని చెబుతుంటారు. కుదురుగా తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఈ ఆలయం, ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాలుడు దర్శనమిస్తూ వుంటాడు.
స్వామివారు రుక్మిణీ సత్యభామల హృదయాల్లోనే కాదు, ఇక్కడి ప్రజల మనసుల్లో కూడా కొలువై వున్నాడని చెప్పొచ్చు. వరాలను కురిపించే వేణుగోపాలుడిని ఇక్కడి వారంతా తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఇక వైశాఖ మాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిదురోజుల పాటు ఘనంగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ... వాళ్లు చేసే భజనలతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది.
ఇక్కడి పరిసర ప్రాంతాల్లో పాడిపంటలు వృద్ధి చెండానికి స్వామివారి అనుగ్రహమే కారణమని భావించిన భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకలు చెల్లిస్తుంటారు. స్వామివారిని దర్శించడం వలన సంపదలతో పాటు, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో పశ్చిమాభిముఖంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దర్శనమిస్తూ వుంటాడు. శైవ సంబంధమైన పర్వదినాలలో సదాశివుడి సన్నిధిలో సందడి ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఒకే ప్రాంగణంలో కొలువైన ఇక్కడి శివకేశవులను స్థానికులు అనునిత్యం పూజిస్తుంటారు ... పునీతులవుతుంటారు.