పాము పుట్టనే కొండలా పెరిగిపోయిందట !
ఒక్కో క్షేత్రాన్ని దర్శించినప్పుడు ... ఆ క్షేత్రం ఆవిర్భవించిన తీరు గురించి తెలుస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి స్థల మహాత్మ్యం గురించిన కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తే ... మరికొన్ని సంఘటనలు నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి సంఘటనే నేపథ్యంగా కలిగిన క్షేత్రంగా, ప్రకాశం జిల్లాకి చెందిన 'గొడ్రాలి కొండ' దర్శనమిస్తూ వుంటుంది.
ఓ గొడ్రాలు భక్తి కారణంగా ఈ కొండ ఏర్పడటం వలన దీనిని ఈ పేరుతో పిలుస్తూ వుంటారు. శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. పేరుకి ఇది గొడ్రాలి కొండనే అయినా, ఇక్కడి స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తూ వుండటం విశేషం. ఇక్కడ ఈ కొండ ఏర్పడటానికీ ... స్వామివారు ఆవిర్భవించడానికి వెనుక బలమైన కారణం వుంది.
పూర్వం ఈ ప్రదేశానికి దగ్గరలో గల గ్రామంలో రాజయ్య ... రాజమ్మ అనే దంపతులు ఉండేవాళ్లట. భర్త బద్ధకస్తుడు కావడంతో రాజమ్మే పొరుగూరు వెళ్లి పాలను అమ్మేసి వస్తూ వుండేది. మార్గ మధ్యంలో ఆమెకి ఒక పాము పుట్ట కనిపించడంతో, అందులో వేంకటేశ్వరస్వామి ఉన్నట్టుగా భావన చేసుకుని రోజు కొన్ని పాలు పోయసాగింది. తనకి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధించసాగింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ఆ పుట్టలో ప్రవేశించి ఆ పాలను తాగుతూ ఉండేవాడు.
స్వామి మహిమ కారణంగా ఆ పుట్ట రోజురోజుకీ కొండలా పెరుగుతూ వెళ్లిందట. దాంతో ఆమె తెచ్చిన పాలన్నీ అందులో పోయడానికే సరిపోయేవి కావు. విషయం తెలుసుకున్న భర్త రాజమ్మను అనుసరిస్తూ వచ్చి దండించబోగా స్వామి ప్రత్యక్షమై వారిస్తాడు ... ఆ దంపతులకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అలా రాజమ్మ భక్తి శ్రద్ధలకు ఈ కొండ నిలువెత్తు నిదర్స్ఘనంగా కనిపిస్తూ వుంటుంది. నేటికీ సంతాన లేమితో బాధలుపడుతోన్న వాళ్లు, ఈ క్షేత్రాన్ని దర్శించి సంతానాన్ని పొందుతూ వుండటం విశేషం.