దుఃఖాలను దూరం చేసే దుర్గాదేవి
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కల్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. ఈ నేపథ్యంలో దుర్గాదేవిగా ఆవిర్భవించిన అమ్మవారు, అనేక మంది అసురులను సంహరించి, వారి బారి నుంచి సాధుజనులను కాపాడింది. దుర్మార్గుల ఆటకట్టించి సన్మార్గుల దుఃఖాలను పారద్రోలే దుర్గాదేవిగా అమ్మవారు లోకులచే నిత్యనీరాజనాలు అందుకుంటోంది.
అమ్మవారు దుష్ట శిక్షణ నిమిత్తం అవతరించినది కనుక, రౌద్ర రసాన్ని ఆవిష్కరిస్తూనే ఆమె దర్శనమిస్తూ వుంటుంది. అలాంటి అమ్మవారు పరమశాంతంగా కనిపిస్తూ 'శాంతదుర్గ' గా పిలవబడే క్షేత్రం మనకి 'గోవా'లో కనిపిస్తుంది. గోవా అనేది ఒక విహార కేంద్రమే కాదు ... ఆధ్యాత్మిక నగరం అనే విషయం కూడా ఇక్కడ అడుగుపెట్టిన తరువాత తెలుస్తుంది. ప్రసిద్ధి చెందిన ఇక్కడి ఆలయాలలో శాంతదుర్గ ఆలయం ఒకటిగా చెప్పబడుతోంది.
పురాణపరమైన నేపథ్యాన్ని కలిగివున్న కారణంగా ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. గర్భాలయంలో అమ్మవారితో పాటు శివకేశవులు దర్శనమిస్తూ వుండటం ఇక్కడి విశేషం. ఇందుకు కారణం ఉందంటూ పురాణ సంబంధమైన కథ ఒకటి ఆసక్తికరంగా వినిపిస్తూ వుంటుంది. ఒకసారి హరిహరులకు మధ్య మొదలైన ఒక వాదన, వాళ్లిద్దరి మధ్య యుద్ధానికి దారితీస్తుంది. పరిస్థితిని గ్రహించిన దుర్గాదేవి, చాలా సున్నితంగా వాళ్లిద్దరినీ శాంతింపజేసిందట.
ఉగ్ర స్వరూపిణిగా అసురులను హడలెత్తించిన అమ్మవారు తాను శాంతమూర్తిగా మారిపోవడమే కాకుండా, శివకేశవుల మధ్య శాంతిని చేకూర్చింది. ఈ కారణంగానే ఇక్కడి అమ్మవారిని శాంతిదుర్గగా భక్తులు కొలుస్తుంటారు. అమ్మవారు హరిహరులను శాంతింపజేసిందని చెప్పడానికి నిదర్శనంగా, గర్భాలయంలో అమ్మవారితో పాటు వాళ్లిద్దరి మూర్తులు కూడా కనిపిస్తూ వుండటం ఇక్కడి ప్రత్యేకత. 17 వ శతాబ్దం ప్రథమార్థంలో నిర్మించబడిన ఈ ఆలయం, కాలక్రమంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది.
అలనాటి నిర్మాణ శైలికి ఈ ఆలయం అద్దంపడుతూ, భక్తుల హృదయాలపై గాఢమైన ముద్రవేస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఇది అనేక విశేషాల సమాహారంగా కనువిందు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. విజయాలను ... సంపదలను అనుగ్రహించే ఆ తల్లికి తమ మనసులోని మాటను నివేదించుకుంటూ వుంటారు. తమ దుఃఖాలను అమ్మవారు దూరం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఆ తల్లికి కానుకలు - మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు ... ఆమె ఆశీస్సులను పొందుతూ వుంటారు.